Friday, September 29, 2023
Beauty

Goan Prawn Curry Recipe : పచ్చి మామిడి తో రొయ్యల కూర …

రొయ్యలతోనూ ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండేవారు రొయ్యలతో అద్భుతమైన వంటకాలు చేస్తారు. అలాంటి వాటిలో గోవన్ ప్రాన్స్ కర్రీ ఒకటి. పచ్చి మామిడి వేసి చేసే ఈ రొయ్యల కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి గోవా రొయ్యల కూరను ఎలా చేయలో ఇక్కడ చూద్దాం.

Also Read: టేస్టీ పాస్తా తయారుచేయడం చాలా ఈజీ

Goan prawn curry with jewelled rice | Healthy Recipe | WW Australia

కావాల్సిన పదార్థాలు:

15-20 రొయ్యలు, సగం కప్పు కొబ్బరి తురుము, కొంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2-3 ఎండు మిర్చి, సగం టేబుల్ స్పూన్ ధనియాలు, సగం టేబుల్ స్పూన్ మిరియాలు, సగం టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 పచ్చి మామిడి, సగం టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు.

Also Read: ఆహా అనిపించే మటన్ ఖీమా

తయారీ విధానం:

  • ముందుగా రొయ్యలను మ్యారినేట్ చేసుకోవాలి. శుభ్రం చేసిన రొయ్యలను తీసుకొని పసుపు, కారంపొడి, ఉప్పు పట్టించి కనీసం అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమామిడిని కట్ చేసి ముక్కలుగా కోసుకోవాలి.
  • కొబ్బరి పొడి, పసుపు, చింతపండు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
  • ఈ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్‌ను పెట్టుకోవాలి. నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. చిటికెడ్ పసుపు వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసి కలిపి మూతపెట్టాలి.ఓ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చి మామిడి ముక్కలతో పాటు మిక్సీలో పేస్ట్‌గా చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఓ 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  • కాసేపయ్యాక పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే సూప్‌లా అవుతుంది. గ్రేవీ చిక్కగా ఉండాలంటే తక్కువ నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ప్యాన్‌పై లిడ్ పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఆ తర్వాత టేస్ట్‌కు తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. రొయ్యలను రెగ్యులర్‌గా కాకుండా గోవా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. మీకే రుచిలో తేడా తెలుస్తుంది.