Wednesday, September 27, 2023
Beauty

Pasta Recipe: టేస్టీ పాస్తా తయారుచేయడం చాలా ఈజీ

కరోనావైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యాక.. ఇంట్లో పాస్తా చేసుకోవడం మరీ పెరిగింది. అందుకే ఈసారి అదే పాస్తాను కాస్త కొత్తగా ట్రై చేద్దాం. ట్యాంగీ టమాటో తో పాటు పోషకాలు ఉన్న పాస్తాను ఇలా సిద్ధం చేద్దాం. ఆరోగ్యకరమైన జీవితానికి కావాల్సిన రుచిని ఎంజాయ్ చేద్దాం.

Also Read : చిల్లీ చికెన్ కర్రీ… టేస్ట్ మామూలుగా ఉండదు

Pasta With Burst Cherry Tomatoes and XO Sauce Recipe | Serious Eats

Also Read : వంకాయ పచ్చి పులుసు.. ఆహా.. అనాల్సిందే.

ఇవి కావాలి:

టోమాటో -4 ( వీటిని ముక్కలు చేసుకోవాలి )
ఉడికించిన పాస్తా -2 బౌల్స్ నిండా
ఉల్లిపాయ- ఒకటి
గ్రేటెడ్ చీజ్-3 చెంచాలు
ఉప్పు, మిరియాలు -రుచికి తగిన విధంగా
పచ్చి మిరపకాయల-2
వెన్న- రెండు చెంచాలు

ఇలా చేయాలి:

1. ఒక ప్యాన్ లో వెన్న వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి
2. ఇందులో మిరపకాయలు, టోమాటోలు వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి.
3. ఇప్పుడు ఉడికించిన పాస్తా, మిరియాల పొడి, ఉప్పు వేయండి
4. రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి కలుపుతూ.. చివరికి ఒక మైక్రో సేఫ్ బౌల్ లోకి తీసుకోండి.
5. పై భాగంలో చీజ్ వేసి దాన్ని ఒవెన్ లో 30 సెకన్ల పాటు ఉంచండి.
6. రుచికరమైన టోమోటా ట్యాంగో పాస్తా రెడీ.