Super Machi : సూపర్ మచ్చి సినిమా టీజర్ రిలీజ్.. మామూలుగా లేదుగా?
పులి వాసు దర్శకత్వంలో మెగా హీరో కళ్యాణ్ దేవ్ తాజాగా నటించిన చిత్రం సూపర్ మచ్చి. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచితా రాయ్ నటిస్తోంది. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, రిజ్వాన్ ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో కళ్యాణ్ దేవ్ మొదట విజేత సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత మంచి సక్సెస్ కోసం ఎదురు చూశాడు.
అయితే అప్పటి నుంచి వేరే సినిమా చేయలేదు. ప్రస్తుతం కిన్నెరసాని, సూపర్ మచ్చి ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నారు.ఈ సూపర్ మచ్చి సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరికి కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. తాజాగా దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకి తమన్ అందించిన ఐదు పాటలు బలం చేకూర్చనున్నాయి.ఇందులో రాజేంద్రప్రసాద్ ,నరేష్, ప్రగతి, అజయ్,పోసాని మురళి కృష్ణ, జబర్దస్త్ మహేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.