Wednesday, September 27, 2023
Health

Blood Clots : కరోనాతో రక్తనాళాలకూ సమస్యే

Blood Clots : కరోనా అనగానే అదేదో ఊపిరితిత్తులకు సంబందించిన జబ్బు అనుకుంటున్నారు. కానీ తీవ్రస్థాయిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శరీరభాగాల్ని కాపాడేందుకు తక్షణమే ఆ క్లాట్స్ ను తొలగించాల్సి రావచ్చునని అంటున్నారు. కోవిడ్ రోగుల్లో కండరాల్లో లోతుగా ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం 14-28 శాతం, పైన ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం 2-5 శాతం ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఈ జబ్బు ఊపిరితిత్తుల ఎంతగా పనిచేస్తుందో రక్తనాళాల మీద కుడా అంతే పని చేస్తుందని భారత్ అనుభవం రుజువు చేసింది. సగటున వారానికి ఇలాంటివి ఐదారు కేసులు వస్తున్నాయి. ఈ వారం రోజుకొకటి వస్తున్నాయని ఢిల్లీ సర్ లగంగారాం హాస్పిటల్ వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అంబరీశ్ సాత్విక్ చెప్పారు. ఆయన ఓ రోగి క్లాట్స్ నమూనాతో తయారు చేసిన క్యాస్టింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. టైప్-2 డయాబెటిస్ ఉన్న కోవిడ్ రోగుల్లో రక్తనాళాల సమస్య ఎక్కువగా కనిపిస్తున్నదని, ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయమై ఇంకా లోతుగా తెలియదని ఆకాశ్ హెల్త్‌కేర్ హాస్పిటల్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ డిపార్టుమెటు అధిపతి డాక్టర్ అమ్రిశ్ కుమార్ అన్నారు. అయితే డయాబెటిక్స్ మాత్రమే కాకుండా చాలామంది రోగుల్లో ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ముద్దలు కనిపించడం గమనార్హం.

Also Read : కరోనా సోకినప్పుడు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసా?