Buttermilk: మార్నింగ్ మజ్జిగతో సంపూర్ణ ఆరోగ్యం!
మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.దీన్ని మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రభావితం చేస్తాయి. పాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిసిన విషయమే. అయితే సల్ల (మజ్జిగ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Also Read: అరటి పండు … బరువు తగ్గేందుకు చక్కటి ఔషధం!
మజ్జిగ ఆరోగ్య ప్రయోజనాలు
- డైట్ పాటించేవారు ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు మజ్జిగ తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. కేలరీలు, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి.
- వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉంటాయి.
- ప్రతి రోజూ ఉదయం మజ్జిగను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది.
- కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, సమస్యలు ఉండవు.
- మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
- ఇందులో లాక్టోజ్, కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. తద్వారా కొవిడ్‌నుంచి తప్పించుకోవచ్చు.
శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. - హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే మజ్జిగ తాగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.
- పరిగడుపున టీ, కాఫీలు తాగేబదులు మజ్జిగ తాగితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
Also Read: బాదం పప్పులను నానబెట్టే తింటే … ప్రయోజనాలు ఏమిటీ?