Wednesday, September 27, 2023
Health

Coconut Water : కొబ్బరినీళ్లు చలికాలంలోనూ మేలు !

కొబ్బరినీళ్లు కేవలం వేసవికాలంలోనే కాదు.. చలికాలంలోనూ తాగవచ్చు. అన్ని కాలాల్లో దొరికే కొబ్బరి బోండాలకు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తినిచ్చే గుణం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌కు మంచి ప్రత్యామ్నాయం ఈ కొబ్బరి బోండాలు. ఒక్క బోండం ఒక సెలైన్‌ బాటిల్‌తో సమానం. రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడ్డవారికి సెలైన్‌ కొరత వస్తే కొబ్బరి బోండాలను ఇచ్చేవారట. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి మన శరీరానికి 17.4 కేలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు చెలామణిలో ఉండేవి.

Tender Coconut Water, नारियल का टेंडर पानी, टेंडर नारियल पानी, टेंडर कोकोनट  वॉटर - Healthicious Foods Enterprises, Ghaziabad | ID: 20125016273

పొడిబారిన నోటికి, అలసిన శరీరానికి కొబ్బరి అమృతంలా అనిపిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్‌ తక్కువగానూ, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండదు. పైగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. తరుచుగా కొబ్బరి నీళ్లుతాగితే, పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు కూడా సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా చూస్తుంది.

కొబ్బరినీళ్లుతో ఆరోగ్య ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తిని పెంచడంలో కొబ్బరినీళ్లు ప్రధానపాత్ర పోషిస్తాయి.
  2. కొబ్బరి నీళ్లలో మాంగనీస్‌ ఎక్కువగా ఉంటుంది. రోజూ తాగితే జీర్ణక్రియారేటు పెరిగి పొట్ట, నడుము దగ్గర కొవ్వు కరుగుతుంది.
  3. వీటిని తాగితే త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే.
  4. మధుమేహంతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. ఇన్సులిన్‌లో వేగం పెరుగుతుంది. ఈ నీళ్లు మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలుచేస్తాయి.
  5. గుండె జబ్బులకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి.
  6. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు సరైన ఆప్షన్. మంచినీళ్ల కంటే ఇవి బాగా పనిచేస్తాయి.
  7. కొబ్బరి నీళ్లలో పీచుపదార్థం, విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తాగిన వెంటనే ఒంట్లో సత్తువ పెరుగుతుంది.
  8. సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచీ కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి.
  9. బ్లడ్‌ ప్రెషర్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
  10. వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగాలి. అప్పుడు బాడీలో నీరసాన్ని ఈ వాటర్ తగ్గిస్తాయి.
  11. తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు తిరుగులేదు.