Immunity : మీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచండి ఇలా ?
Immunity : ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగనిరోధకత పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా థర్డ్‌వేవ్, పిల్లలపై దాని ప్రభావం వార్తల నేపథ్యంలో.. ఒకవేళ అది వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు ఇప్పటినుంచే జాగ్రత్త పడితే వారికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు తీసుకునే అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకత పెంచే ఆహారం ఎక్కువగా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో తినే ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి.
ఈ వంటకాలు ప్రయత్నించండి
- చికెన్ + తోటకూర/మెంతికూర
- మటన్ + గోంగూర/ ములక్కాయ/తోటకూర
- ఎగ్ ప్యాండర్+ గ్రీన్‌పీస్ మసాలా
- రాజ్‌మా రైస్+ సోయా చంక్స్ మసాలా
- మింట్ రైస్+ మిక్స్‌డ్ వెజ్ కర్రీ
- బగారా రైస్+ పాలక్ పనీర్
- జీరా రైస్+ దాల్ ఫ్రై, కర్డ్ రైతా
- మిల్లెట్ బిసిబిల్లా బాత్
- మిక్స్‌డ్ వెజ్ సాంబార్+బీన్స్ ఫ్రై,
- టొమాటో కార్న్, మిక్స్‌డ్ వెజ్/మష్రూమ్/చికెన్ సూప్
Also Read : ఆరోగ్యానికి మేలుచేసే అవకాడో ఫ్రూట్