Vitamin D Causes HighToxicity : ‘విటమిన్ డి’ టాబ్లెట్లు… మోతాదుకు మించితే ప్రమాదం
విటమిన్ డి శరీరం ఎముకలకి కాల్షియం పీల్చుకోవటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది మరియు విటమిన్ డి లోపం వలన ఎముకలు మెత్తబడి ఆస్టియోమలేసియా అనే వ్యాధి లేదా ఎముకలు అసాధారణంగా మారే స్థితి రికెట్’స్ కో దారితీస్తుంది. విటమిన్ డి లోపం లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, రుతువుతో తగ్గి పెరిగే డిప్రెషన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్, బలహీనమైన ఎముకలు, చర్మ సమస్యలు మరియు డిమెన్షియా వంటివి రావచ్చు.
Also Read: ఆశ్వగంధ… లైంగిక సంబంధిత సమస్యల నివారిణ !
ఈ మధ్య విటమిన్ డి లోపం ఉన్నా పట్టించుకోని వాళ్లందరూ కరోనా సమయంలో శ్రద్ద వహిస్తున్నారు. కరోనాను తరిమికొట్టేందుకు విటమిన్ డి తోడ్పడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో చాలామంది విటమిన్ డి టాబ్లెట్లు తెచ్చుకొని మరీ వాడుతున్నారు. ఇలా చేసినా కూడా ముప్పు వాటిల్లుతుంది. సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి దొరకుతుంది. ఇది దొరకని వాళ్లంతా టాబ్లెట్లకు అలవాటు పడుతున్నారు. అయితే ఈ టాబ్లెట్లు తీసుకోవాలనుకునేవాళ్లు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
Also Read :ఆకాకరతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…
విటమిన్ డి టాబ్లెట్లు అధికంగా వాడడం వల్ల దేహంలో క్యాల్షియం స్థాయి ఎక్కువ అవుతుంది. శరీరంలో విషపదార్థాల శాతం పెరుగుతుంది. అంతేకాదు తీవ్ర అస్వస్థతకు గురవుతారని ముంబయి కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి టాబ్లెట్లు వాడేముందు శరీరంలో విటమిన్ డి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వైద్యుల సలహా మేరకు వాడితే సరిపోతుంది.
Also Read: చక్కెరతో బోలెడు చిక్కులు…ఇలా నివారించవచ్చు..