Wednesday, September 27, 2023
Health

Wear a Mask : ఆ సమయంలోనూ మాస్క్ తప్పనిసరి ?

ప్రస్తుతం మన జీవితంలో మాస్క్ ఒక భాగమైంది. ఇప్పటి వరకు బయటకు వెళితే మాస్క్ పెట్టుకోవాలని నిపుణులు చెప్పారు.టాయ్ లెట్ లోనూ మాస్క్ తప్పదన్నారు…ఇప్పుడు పడకగదిలో పార్ట్ నర్ తో రొమాన్స్ చేసే సమయంలోనూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనట.శృంగార సమయంలో కూడా మాస్క్ తప్పనిసరి అంటున్నారు కెనడాకు చెందిన డాక్టర్ థెరెసా టాం…

Also Read: ‘విట‌మిన్ డి’ టాబ్లెట్లు… మోతాదుకు మించితే ప్రమాదం

Wear a mask while having sex and avoid kissing new people, Canada's top  doctor advises | WTOP

శృంగార సమయంలో కూడా మాస్క్ తప్పనిసరి అంటున్నారు కెనడాకు చెందిన ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టాం…అంతే కాదండోయ్.. ఆ సమయంలో ముద్దు పెట్టుకోవద్దని, ఇరు ముఖాల్ని సైతం దగ్గరగా రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఏమాత్రం తగ్గని ఈ పరిస్థితిలో వీలైనన్నీ పరిమితులతో శృంగారంలో .పాల్గొనడం మంచిదని సలహా ఇస్తున్నారు….ముఖ్యంగా ముద్దు వంటి సన్నిహిత సంబంధాలను దూరం పెట్టడమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తికి భౌతికదూరం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని, శృంగారంలో భౌతిక దూరానికి తావు లేకపోవడం వల్ల కనీసం మాస్కులైనా ధరించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు.