Corona Third wave : కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. హెచ్చరికలు జారీ
Corona Third wave : కరోనా సెకండ్ వేవ్‌తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన కే విజయరాఘవన్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రిమిస్తాయని ఆయన తేల్చి చెప్పారు. కొవిడ్ పరిస్థితి, రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పని చేస్తున్నారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ వేరియంట్లను ముందుగానే గుర్తించి వాటిని సమర్థంగా ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పింది. ఈ పని ఇండియాలోనూ జరుగుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వేరియంట్లపై(Corona Third wave) వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టించేవి, వ్యాధి తీవ్రతను పెంచే లేదా తగ్గించే వేరియంట్లు రాబోతున్నాయని చెప్పింది.